అమరవీరుల్లారా అందుకోకండి ఈ నివాళి
on Nov 29, 2008
మేము మారం. మా ఆలోచనలో మార్పు రాదు. మత మౌడ్యం తోనూ, కులగజ్జి తోనూ, వర్గ ప్రయోజనాలకోసం , నాయకులు రాల్చే చిల్లర కోసం మేము ఈ వ్యవస్థకు ఊపిరులు పోస్తాం. అవినీతి పెను భూతానికి ప్రాణం పోస్తాం. చేయకూడనవన్నీ మేమే చెసి ఇంకెవరినో నిందిస్తాం. మా భావజాలంతో మరెందరివో మస్తిష్కాలను కలుషితం చేస్తాం. మమల్ని మేమే మోసం చెసుకుంటూ ఈ కర్మభూమిలో భావదారిద్ర్యంతో బతుకుతూ ఉంటాం. చేయాల్సినవి చేయకుండా భగవంతుడి మీద భారం వేస్తాం. మీరు మోసినట్లు ఈ భారాన్నిభగవంతుడు మోయగలడా?
అమర వీరుల్లారా క్షమించకండి ఈ దేశాన్ని- అందుకోకండి ఈ నివాళి.